పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో అయితే మోత మోగిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రాగా ఈ రెస్పాన్స్ అయితే చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో అయితే ప్రెస్ నోట్ లు రిలీజ్ చేశారు.
మన ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే మా ప్రయత్నం లో సలార్ టీజర్ కి 100 మిలియన్ వ్యూస్ తో అదిరే రెస్పాన్స్ ని అందించించందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అయితే భారతీయ సినిమా వైభవాన్ని చాటి చెప్పేందుకు ఆసక్తికర ట్రైలర్ తో అయితే ఈ ఆగస్ట్ నెలని మార్క్ చేసి పెట్టుకోండి అని కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ అవైటెడ్ ట్రైలర్ కోసం మొత్తం రెడీ చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంని దిగ్గజ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.