తండేల్ జాతరకు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

తండేల్ జాతరకు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Published on Feb 1, 2025 7:00 PM IST

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించగా పూర్తి లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఐకాన్ స్టా్ర్ అల్లు అర్జున్ కూడా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

నేడు జరగాల్సిన ‘తండేల్ జాతర’ ఈవెంట్ కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే, ఇప్పుడు ఈ తండేల్ జాతరకు టైమ్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ ‘తండేల్ జాతర’ ఈవెంట్‌ను ఫిబ్రవరి 2న సాయంత్రం 5 గంటలకు నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్ వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు