“కింగ్డమ్” టీజర్ బీట్స్ ట్రీట్ కి టైం ఫిక్స్!

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న భారీ చిత్రం “కింగ్డమ్” అని చెప్పాలి. ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఎట్టకేలకి కొన్ని వారాలు కితమే అవైటెడ్ టైటిల్ సహా టీజర్ ని రిలీజ్ చేశారు.

అయితే దీనికి భారీ రెస్పాన్స్ రాగా ఇపుడు ఫైనల్ గా ఈ టీజర్ లో సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన సాలిడ్ స్కోర్ ట్రీట్ కి మేకర్స్ టైం లాక్ చేశారు. ఈ మార్చ్ 17 సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి ఈ ట్రాక్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో ఇపుడు ఫ్యాన్స్ ఆ క్రేజీ బీట్స్ ట్రాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version