విజయ్ “గోట్” లో టైం ట్రావెల్!?

విజయ్ “గోట్” లో టైం ట్రావెల్!?

Published on Jun 22, 2024 10:05 AM IST


కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ విషయంలో ఇప్పటికే చాలా రకాల థియరీలు ఉండగా ఇదొక టైం ట్రావెల్ బేస్ సినిమా అని కూడా ఇంట్రస్టింగ్ బజ్ అయితే ఉంది.

ఇక ఈ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ సాలిడ్ గ్లింప్స్ కట్ ని చూసినట్టు అయితే అందులో చివరి 5 సెకండ్ లలో వెంకట్ ప్రభు చాలానే సర్ప్రైజ్ లు పెట్టాడు. అయితే అందులో ఒక్క షాట్ లో మాత్రం 2050 సంవత్సరం కనిపిస్తుంది. అయితే అక్కడ 2050 నాటికి ఏదో పీక్ కి చేరుకుంటుంది అన్నట్టుగా కనిపిస్తుంది. దీనితో టైం ట్రావెల్ లాంటిది లేకపోయినా ఫ్యూచర్ సంబంధించి ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ సినిమాలో ఉందని చెప్పవచ్చు. మరి వెంకట్ ప్రభు విజయ్ తో ఏం ప్లాన్ చేసాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు