సమీక్ష : తిరగబడరా సామీ – ఏమాత్రం ఆకట్టుకోని బోరింగ్ డ్రామా

సమీక్ష : తిరగబడరా సామీ – ఏమాత్రం ఆకట్టుకోని బోరింగ్ డ్రామా

Published on Aug 3, 2024 3:02 AM IST
Tiragabadara Saami Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 02, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, రఘుబాబు, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, ప్రగతి, మకరంద్ దేశ్ పాండే

దర్శకులు: రవి కుమార్ చౌదరి

నిర్మాతలు : సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా

సంగీత దర్శకుడు: భోలే షావలి

సినిమాటోగ్రఫీ: జవహర్ రెడ్డి ఎం ఎన్

ఎడిట‌ర్ :

సంబంధిత లింక్స్: ట్రైలర్

టాలీవుడ్ యంగ్ హీరో జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. గత వారమే “పురుషోత్తముడు” గా పలకరించిన తాను ఈవారం థియేటర్స్ లోకి “తిరగబడరా సామీ” అంటూ వచ్చాడు. మరి ఈ చిత్రంతో ఆకట్టుకున్నాడో లేదో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ:

ఇక కథలోకి వెళ్లినట్టు అయితే.. గిరి (రాజ్ తరుణ్) తన చిన్నతనంలోనే ఓ జాతరలో తప్పిపోయి తల్లిదండ్రులని కోల్పోతాడు. అక్కడ నుంచి హైదరాబాద్ లోని ఓ కాలనీలోనే పెరిగి పెద్దవాడు అవుతాడు. అయితే పెద్దయ్యాక తనకి జరిగినట్టుగా ఎవరికీ జరగకూడదు అని బయట కుటుంబాలలో ఎవరెవరు తప్పిపోయిన వారు ఉంటారో వారిని తిరిగి మళ్ళీ వారి కుటుంబాలకి అప్పగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తనకి కూడా ఒక భార్య, పిల్లలు మంచి కుటుంబం కావాలి అనుకుంటాడు. ఆ సమయంలో తనకి శైలజ (మాల్వి మల్హోత్రా) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ గిరీకి, అత్యంత క్రూరుడైన జహీర్ బాగ్ కొండారెడ్డి (మకరంద్ దేశ్ పాండే) నుంచి ఒక డీల్ వస్తుంది. ఒకరిని వెతికి పట్టుకొని తనకి అప్పగించాలని కొండారెడ్డి డీల్ చేసుకుంటాడు. మరి అలా అతను చెప్పిన వ్యక్తి ఎవరు? శైలజ ఎందుకు గిరి లైఫ్ లోకి వస్తుంది. తన డీల్ వల్ల గిరి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అనేది ఈ సినిమాలో మిగతా భాగం.

 

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో లీడ్ నటీనటులు మాత్రం బాగా చేశారు. రాజ్ తరుణ్ తన సహజ నటనతో తన రోల్ కి పూర్తి న్యాయం చేసాడు. డీసెంట్ లుక్స్ లో ఒక సింపుల్ కుర్రాడిలా అమాయకత్వం, హ్యాండ్సమ్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా ఈ సినిమాలో చాలా బాగా చేసింది. సినిమాలో అందంగా కనిపిస్తూ.. రాజ్ తరుణ్ తో కలిసి కొన్ని సీన్స్ లో చాలా బాగా చేసింది. అలాగే చూసేందుకు వీరి జంట కూడా ఆన్ స్క్రీన్ పై బాగుంది.

ఇక వీరితో పాటుగా సినిమాలో కనిపించిన ఇతర నటీనటులు రఘుబాబు, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి అలాగే ప్రగతి, రాజా రవీంద్రలు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా విలన్ గా కనిపించిన నటుడు మకరంద్ దేశ్ పాండే మంచి విలనిజాన్ని చూపించాడు. ఇంకా సినిమాలో అక్కడక్కడా ఒకటి రెండు కామెడీ సీన్స్ ఓకే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సినిమాలో బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో చాలా వరకు డిజప్పాయింటింగ్ అంశాలు కనిపిస్తాయని చెప్పాలి. దర్శకుడు తీసుకున్న లైన్ లో రాజ్ తరుణ్ పాత్ర వరకు ఓకే కానీ మిగతా కథనం అంతా చాలా దారుణంగా కొనసాగుతుంది. ఒక అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే తో సినిమా కొనసాగుతుంది. సినిమా నిడివి తక్కువే అయినప్పటికీ చాలా వరకు సీన్స్ కొన్ని సన్నివేశాలు పరమ బోరింగ్ గా ఆడియెన్స్ ని ఇరిటేట్ చేసే విధంగా అనిపిస్తాయి.

ఇంకా సినిమాలో బాగా చికాకు తెప్పించే అంశం ఏదన్నా ఉంది అంటే నటి మన్నారా చోప్రా అని చెప్పాలి. ఆమెపై డిజైన్ చేసిన సన్నివేశాలు కానీ ఫోర్స్డ్ గా ఇరికించిన సాంగ్ కానీ సినిమాలో వరస్ట్ ఎక్స్ పీరియన్స్ ని కలిగిస్తాయి. అలాగే తనకి ఈ రోల్ కూడా అస్సలు సూట్ కాలేదు. ఇంకా నటుడు జాన్ విజయ్ పాత్ర కూడా సినిమాలో వేస్ట్ అయ్యిపోయింది.

వీటితో పాటుగా కొన్ని సీన్స్ అయితే మరీ ఓవర్ గా లాజిక్స్ లేకుండా కనిపిస్తాయి. సినిమా స్టార్టింగ్ లోనే ఒకరి కోసం ఫోటో బయట మనుషులకి చూపించడం వారు తెలీదు అని చెప్తే ఆ తెలీదు అని చెప్పిన వారిని ఆ ఫోటో చూసారని చంపెయ్యడం లాంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఆడియెన్స్ బుర్ర పాడయ్యేలా చేస్తుంది. ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి.

సినిమా టైటిల్ కి తగ్గట్టు న్యాయం చేద్దామని ఏడో ట్రై చేశారు కానీ అది అస్సలు వర్కౌట్ కాలేదు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ లో రాజ్ తరుణ్ పై సీన్స్ ఓవర్ డ్రమాటిక్ గా కనిపిస్తాయి, పైపెచ్చు తాను పలికించిన డైలాగ్స్ కూడా పేలవంగా అనిపిస్తాయి. ఈ సినిమా మాత్రం రాజ్ తరుణ్ కెరీర్లో వీక్ ఛాయిస్ అని చెప్పాలి.

 

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. సినిమా పరిధి మేరకు ఎంతవరకు కావాలో అంతవరకు మేకర్స్ బడ్జెట్ కనిపిస్తుంది. ఇక టెక్నికల్ టీం లో జేబీ, భోలే శావళి సంగీతం, రీరికార్డింగ్ పర్వాలేదు. ఒక్క ఐటెం సాంగ్ మాత్రం బాగాలేదు. మిగతా పాటలు ఓకే అనిపిస్తాయి. జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్, మన్నారా చోప్రా పై సాంగ్ ని కట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు రవి కుమార్ చౌదరి విషయానికి వస్తే.. తాను ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేకపోయారు అని చెప్పాలి. పాత్రలు వరకు తన డిజైన్ బాగానే ఉంది కానీ కథనం మాత్రం పేలవంగా ఉందని చెప్పాలి. లాజిక్స్ లేకుండా ఓవర్ డ్రమాటిక్ గా పలు సన్నివేశాలు వరస్ట్ గా ప్రెజెంట్ చేశారు. కేవలం కొన్ని కామెడీ ట్రాక్స్ వరకు ఓకే కానీ క్లైమాక్స్ కూడా సినిమాలో చాలా బలహీనంగా డిజైన్ చేశారు.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “తిరగబడరా సామీ” పర్వాలేదు అనిపించే అంశాలని బాగోలేని అంశాలే ఎక్కడికక్కడ డామినేట్ చేసి వదిలాయి. తెరపై మెయిన్ లీడ్ బాగుటుంది. ఒకటి రెండు కామెడీ సీన్స్ బాగున్నాయి తప్పితే మిగతా సినిమా అంతా బోరింగ్ గా చికాకు తెప్పించేలా ఉంటుంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ కెరీర్ లోనే ఈ చిత్రం ఒక వీక్ ఛాయిస్ అని చెప్పవచ్చు. వీటితో ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని స్కిప్ చేసేయడమే మంచిది.

123telugu.com Rating: 1.75/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు