‘పుష్ప-2’ టైటిల్ కోసం కసరత్తులు

Published on May 18, 2021 4:58 pm IST

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో ఒక్క భాగమే అనుకున్నా తాజాగా రెండు భాగాలని డిసైడ్ చేశారు. సుకుమార్ కథలో మార్పులు, చేర్పులు చేసుకున్నాకనే ఈ డెసిషన్ తీసుకున్నారు. మొదటి భాగానికి ‘పుష్ప’ అనేది టైటిల్ అయితే రెండవ భాగానికి ఏ టైటిల్ పెడతారనేది సర్వత్రా చర్చనీయంశమైంది. చిత్ర టీమ్ కూడ టైటిల్ వెతుకులాటలో ఉంది. త్వరలోనే కొత్త పేరును డిసైడ్ చేసి అధికారికంగా ప్రకటిస్తారట.

ఇకపోతే చిత్ర షూటింగ్ లాక్ డౌన్ అనంతరం మొదలవుతుంది. ఇంకో రెండు నెలల పాటు మొదటి భాగం తాలూకు చిత్రీకరణ జరుగుతుంది. ఈ ఏడాది ఆఖరుకు ‘పుష్ప’ సినిమా హాళ్లలోకి రానుంది. ఇక రెండవ పార్ట్ చిత్రీకరణ కూడ మొదటి పార్ట్ విడుదలైన వెంటనే మొదలవుతుందట. మైత్రీ మూవీ మేకర్స్ సుమారు 250 కోట్ల వ్యయంతో ఈ రెండు భాగాలను నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో ఫేహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనుండగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. బన్నీ కెరీర్లో అత్యంత భారీ చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు గట్టిగనే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :