పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న వస్తుండటంతో ఆయన అభిమానులు బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన పలు సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక జపాన్‌లోనూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.
ఇప్పటికే ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని అభిమానులు ప్రత్యేక షో వేసుకుని వీక్షించారు. అంతేగాక, ఆయన బర్త్ డే అడ్వాన్స్ సెలబ్రేషన్స్‌ని కూడా నిర్వహించారు. ఇలా ఓ ఇండియన్ స్టార్ పుట్టినరోజును.. అది కూడా అడ్వాన్స్‌గా నిర్వహించడంతో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ దేశంలో ఎంతమేర ఉంతో అర్థం చేసుకోవచ్చు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత హను రాఘవపూడి డైరెక్షన్లో ‘ఫౌజీ’ అనే సినిమాలో నటించనున్నాడు.