రీరిలీజ్స్ పట్ల టాలీవుడ్ ఆడియెన్స్ కి ఇంట్రెస్ట్ తగ్గుతుందా

రీరిలీజ్స్ పట్ల టాలీవుడ్ ఆడియెన్స్ కి ఇంట్రెస్ట్ తగ్గుతుందా

Published on Nov 18, 2023 11:00 AM IST

మన టాలీవుడ్ లో రీసెంట్ గా స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలు నుంచి స్టార్ట్ అయ్యిన ఈ ట్రెండ్ లో వారి చిత్రాలకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అలా తర్వాత మరిన్ని టాలీవుడ్ చిత్రాలు అలానే తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజ్ అయ్యి అనూహ్య స్పందనను తెలుగు ప్రేక్షకుల నుంచి అందుకున్నాయి.

కానీ ఇప్పుడు మాత్రం ఈ రిలీజ్ లు ఎక్కువ అవుతూ వస్తుండడంతో ఆడియెన్స్ లో కూడా ఆసక్తి తగ్గుతున్నట్టే అనిపిస్తుంది. నార్మల్ ఆడియెన్స్ లోనే కాకుండా ఫ్యాన్స్ లో కూడా అంత ఆసక్తి కనిపించడం లేదు అనిపిస్తుంది. దీనికి లేటెస్ట్ గా వచ్చిన రీ రిలీజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ క్లాసిక్ ఎంటర్టైనర్ “అదుర్స్” రీ రిలీజ్ అనే చెప్పాలి.

దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ వేరు అయినా కూడా ఈ సినిమాకి ఇప్పుడు డల్ రెస్పాన్స్ నమోదు కావడం గమనార్హం. ఇక ఇదే కాకుండా రీసెంట్ గా వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ కి కూడా మరీ అంతగా భారీ రెస్పాన్స్ రాలేదు. మరి వీటితో రీ రిలీజ్ చిత్రాలు ఎక్కువ అవ్వడం వల్లో లేక ఫ్యాన్స్ ఆడియెన్స్ కి కూడా ఆసక్తి తగ్గిపోవడం మూలానో మాత్రం ఈ ట్రెండ్ కి ముగింపు వచ్చేలా ఉందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు