‘వకీల్ సాబ్’ తర్వాత పెద్ద సినిమాలకు కష్టమేనా ?

‘వకీల్ సాబ్’ తర్వాత పెద్ద సినిమాలకు కష్టమేనా ?

Published on Apr 8, 2021 12:25 AM IST

కరోనా తగ్గడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కోలుకుంది. షూటింగ్స్ ఊపందుకున్నాయి. థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో సినిమాలు వరుసగా విడుదలవుతూ వస్తున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు అలవాటుపడుతున్నారు. ఇప్పుడిప్పుడే పెద్ద హీరోల సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ కానుంది. దాని వెనుకనే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగష్టు నెలల్లో వరుసపెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ పెట్టుకున్నాయి.

‘ఆచార్య, నారప్ప, బాలయ్య – బోయపాటి సినిమా, కెజిఎఫ్ 2, రాధేశ్యామ్, పుష్ప, ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ సినిమాలన్నీ విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. వీటితో పాటే మీడియమ్ సినిమాలు చాలానే విడుదలకానున్నాయి. కానీ పెరుగుతున్న కరోనా కేసులు ఈ సినిమాలన్నింటినీ ఆందోళనలో పడేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేయడానికి థియేటర్లు మూసివేశారు. ఇంకొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతులు ఇచ్చారు. పెరుగుతున్న వైరస్ వ్యాప్తిని చూస్తుంటే లాక్ డౌన్ ఖాయమనే టాక్ వినబడుతోంది. ‘వకీల్ సాబ్’ మాత్రమే సమయానికి వస్తుందని, దాని తర్వాత సినిమాలు పోస్ట్ ఫోన్ అవుతాయని అంటున్నారు. దీంతో పెద్ద సినిమాలన్నీ డైలమాలో పడిపోయాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు