ఇది నిజంగా మన తెలుగు చిత్ర పరిశ్రమకు మరో తీరని లోటు అని చెప్పాలి. మన తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది విలన్ రోల్స్ చేసినప్పటికీ విలనిజం అనే పదానికి సిసలైన అర్ధం చూపింది మాత్రం మన తెలుగు విలక్షణ నటుడు జయ ప్రకాష్ రెడ్డి అని చెప్పాలి. ఎన్నో చిత్రాల్లో ట్రెండ్ సెట్టింగ్ విలన్ రోల్స్ తో పాటుగా ఎన్నో రోల్స్ చేసిన ఈ అద్భుతమైన సీనియర్ నటుడు ఇప్పుడు కన్ను మూసారన్న వార్త తెలుగు సినిమా వర్గాలను విస్మయానికి గురి చేసింది.
ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తేఎన్నో చిత్రాల్లో నటించి బిజీగా జీవనం కొనసాగిస్తున్న జయప్రకాష్ రెడ్డి ప్రస్తుతం లాక్ డౌన్ మూలాన ఎలాంటి షూటింగులు లేక తన స్వస్థలం గుంటూరులోనే నివాసం ఉంటున్నారు. కానీ అకస్మాత్తుగా ఆయనకు గుండె పోటు రావడంతో ఆయన ఇంట్లోనే ఈరోజు ఉదయం రెస్ట్ రూమ్ లో ఒక్కసారోగా కుప్పకూలిపోయారు. దీనితో పరిస్థితి తెలుసుకునే లోపే ఆయన కన్ను మూసిన వార్త బయటకొచ్చింది. దీనితో తెలుగు సినిమా వర్గాలు ఇలాంటి విలక్షణ నటుని కోల్పోయినందుకు దిగ్బ్రాంతికి లోనయ్యాయి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.