ఐపీఎల్ లో టాలీవుడ్ డామినేషన్.!

ఐపీఎల్ లో టాలీవుడ్ డామినేషన్.!

Published on Apr 15, 2025 7:03 AM IST

పాన్ ఇండియా వైడ్ గా ఆడియెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్, అలాగే సినిమాల ద్వారా వచ్చే ఎంటర్టైన్మెంట్ కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమాల ఇంపాక్ట్ కూడా ప్లేయర్స్ లో కనిపిస్తుంది. తమ నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందిస్తే వాటిని సినిమా హీరోస్ తరహాలో సెలబ్రేట్ చేసుకోవడం ఇపుడు బాగా ఎక్కువగా కనిపిస్తుంది.

ఇక ఈసారి ఐపీఎల్ లో మాత్రం మన తెలుగు సినిమా డామినేషన్ అండ్ మేనియా గట్టిగా కనిపిస్తుంది అని చెప్పాలి. మెయిన్ గా సోషల్ మీడియాలో ముంబై, రాజస్థాన్, ఢిల్లీ ఇంకా పంజాబ్ కింగ్స్ లాంటి నార్త్ జట్లు సోషల్ మీడియాలు సైతం మన తెలుగు సినిమాలు టెంప్లేట్స్ ఇంకా మీమ్స్ తో అలరిస్తూ ఉండడం గమనార్హం. దీనితో పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ఐపీఎల్ లో కూడా ఓ రేంజ్ లో టాలీవుడ్ హవా కొనసాగుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు