టాలీవుడ్ కి కావాల్సింది అలాంటి కంటెంట్ నే !

టాలీవుడ్ కి కావాల్సింది అలాంటి కంటెంట్ నే !

Published on Oct 27, 2020 12:05 AM IST

సినిమా పరిశ్రమకి ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సింది కామెడీ ఉన్న కంటెంట్ నే. కానీ, విశ్వసనీయత, విషయం ఉన్న కామెడీ స్ర్కిప్టులను రాసే వారే కరువయ్యారు. సమస్యల వలయంలో పడి బాధ పడుతున్న నేటి జనరేషన్ కి ఉపశమనం కలిగించే చక్కని కామెడీ కంటెంట్ ను అందించే దర్శకరచయితల కోసం టాలీవుడ్ ఎదురు చూస్తోంది. కాకపోతే జంధ్యాల మార్క్ కామెడీ మళ్ళీ వస్తోందా.. ఈవివి మాస్ కామెడీని క్రియేట్ చేసే విజన్ ఎవరికైనా ఉంటుందా అనేదే ఇక్కడి సమస్య. ప్రస్తుతం అనిల్ రావిపూడి లాంటి వారు కామెడీతో ఆకట్టుకుంటున్నా.. ఇంకా అలాంటి దర్శకులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే కామెడీ రాసేవారు ఎక్కువమంది రావాలి అంటే.. కామెడీ రాయగలిగేవారికి రెమ్యునరేషన్ ను అమాంతం పెంచాలి. సినిమా అందర్నీ మెప్పించాలంటే రైటర్ బాగా రాయాలి. రాసిన రైటర్ కి విలువ లేనప్పుడు విలువైన కామెడీని ఎందుకు రాస్తారు. అందుకే నిర్మాతలు దర్శకులు ఇప్పటికైనా రైటర్ లకు రెమ్యునరేషన్ పరంగా కూడా తగిన గౌరవం ఇవ్వాలి. రైటర్స్ ను తక్కువ చేసిన దర్శకులు బతుకులు తలక్రిందులు అయిపోయిన సంఘటనలు ఇప్పటికే చాలా చూశాము. ఇప్పటికైనా రైటర్ కి తగిన గౌరవం ఇవ్వకపోతే భవిష్యత్తులో వారే దర్శకులుగా మారతారు. అప్పుడు కామెడీ సినిమాలు ఇంకా తగ్గిపోతాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు