మంచి కంటెంట్ తో కూడిన భారీ చిత్రాలతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్పీడ్

మంచి కంటెంట్ తో కూడిన భారీ చిత్రాలతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్పీడ్

Published on Jul 30, 2024 5:05 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో శరవేగంగా అందులోని పలు భారీ బడ్జెట్ లతో కూడిన కంటెంట్ ఓరియెంటెడ్ ఎంటర్టైనర్ లని అందిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడ్డాగా మారింది అని చెప్పవచ్చు. విజనరీ ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ తన టేస్ట్‌కు తగ్గట్టుగా అన్ని రకాల జానర్లలో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న రాబోతోంది. తాజాగా ట్రైలర్ విడుదలై ఆన్లైన్ లో ట్రెండ్ అయింది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మరో అద్భుతమైన చిత్రం “ది రాజా సాబ్” రాబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు మారుతి ఇటీవలే ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు.ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ అద్భుతమైన కొత్త లుక్‌లో కనిపించారు. గ్లింప్స్‌కి పాజిటివ్ రియాక్షన్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

టీజీ విశ్వ ప్రసాద్ ప్రస్తుతం తన ప్రొడక్షన్ కంపెనీ లైనప్‌ను ఇంట్రెస్టింగ్‌గా మలిచారు. తేజ సజ్జతో మిరాయ్, అడివి శేష్‌తో G2 వంటి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆకర్షణీయమైన కథనాలను రూపొందించడంలో, విభిన్న కథాకథనాలను అన్వేషించడంలో నిర్మాణ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది.

అంతేకాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవలె సన్నీ డియోల్, గోపీచంద్ మలినేనిల డైనమిక్ కాంబినేషన్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. స్టార్ హీరోలు, స్టార్ క్యాస్టింగ్‌తో అద్భుతమైన కంటెంట్-సెంట్రిక్ మూవీస్‌లను నిర్మిస్తోంది. ఇలా టాలీవుడ్ లో అయితే మిడ్ నుంచి హై రేంజ్ బడ్జెట్ సినిమాల వరకు కూడా భారీ చిత్రాలను వరుసగా చేస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు