అధ్వానంగా మారుతున్న టాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్ వార్స్

సినిమాలో స్టార్ హీరోస్ అందరికీ భారీ లెవెల్లో ఫ్యాన్స్ ఉంటారు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ చూపించే అభిమానం మాత్రం మరో రీతిలో ఉంటుంది అని చెప్పాలి. ఇంట్లో అమ్మ నాన్నల కంటే తమ అభిమాన హీరోలు అంటేనే ప్రాణం ఇస్తాం అంటారు. అలాంటి ఫ్యాన్స్ దాదాపు టాలీవుడ్ లో అందరు బిగ్ స్టార్స్ కి కూడా ఉన్నారు.

అయితే ఈ అందరి నడుమ ఒకో హీరో మరో హీరో ఫ్యాన్స్ కి గొడవలూ రికార్డు, కలెక్షన్స్ వంటి వాటిలో గొడవలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అయితే సోషల్ మీడియా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఈ వార్స్ ఫేస్ బుక్ పేజీలలో కొన్ని పేర్లు వాటిలో ఒక హీరో పేజికి ఇంకో హీరో పేజెస్ లో కౌంటర్లు రివర్స్ కౌంటర్లు ఇవ్వడం నుంచి ట్విట్టర్ లో భారీ ట్రెండ్స్, నెగిటివ్ ట్రెండ్స్ వరకు వచ్చింది.

అయితే ఫేస్ బుక్ లో ఆ ఎరా ముగిసిపోయాక ఆ బ్యాచ్ తర్వాత మిగతా అంతా ఇపుడు ఎక్స్(ట్విట్టర్) లోకి వచ్చారు. ఇక్కడ నుంచి టాలీవుడ్ హీరోస్ ఫ్యాన్స్ అపుడు ఫేస్ బుక్ లో చేసే యుద్ధాలు ట్విట్టర్ లో చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇది ఎపుడు ఎంత దారుణంగా మారుతుంది అంటే అది ఇక్కడ కోపాలు ఆయా హీరోలపై దారుణంగా విషం కక్కేలా చేస్తున్నాయి.

విమర్శ ప్రతి విమర్శకి ఒక హద్దు ఉండాలి. ఇపుడు కామెంట్స్ ఏ రేంజ్ కి వెళ్లాయి డైరెక్ట్ థియేటర్స్ దగ్గర దారుణమైన ఫ్లెక్స్ లు ఇతర హీరోలని కించపరుస్తూ మన తెలుగు హీరోల పరువుని ఎవరికో ఛాన్స్ ఇవ్వకుండా మనమే తీసుకుంటున్న పరిస్థితులు వచ్చేసాయి.

ఓ పక్క తెలుగు సినిమా ఖ్యాతిని మన హీరోస్ పాన్ వరల్డ్ లెవెల్లోకి తీసుకెళ్తుంటే వారి ఫ్యాన్స్ మాత్రం ఛీప్ గా ఫ్లెక్స్ లు వేస్తూ పరిస్థితులు అధ్వాన్నంగా మారుస్తున్నారు. మరి ప్రెజెంట్ సోషల్ మీడియాలో పవన్, అల్లు అర్జున్ అభిమానుల నడుమ నడుమ జరుగుతున్న ఫ్యాన్ వార్ కోసమే ఇతర హీరోల ఫ్యాన్స్ లో కూడా రచ్చ నడుస్తుంది. మరి వీటన్నిటికి ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.

Exit mobile version