లేటెస్ట్ : పెళ్ళికి రెడీ అయిన టాలీవుడ్ యంగ్ యాక్టర్ ?

లేటెస్ట్ : పెళ్ళికి రెడీ అయిన టాలీవుడ్ యంగ్ యాక్టర్ ?

Published on Jan 25, 2023 2:10 AM IST

టాలీవుడ్ యంగ్ యాక్టర్ శర్వానంద్ తన కెరీర్ బిగినింగ్ నుండి పలు విభిన్న కాన్సెప్ట్ సినిమాల్లో నటిస్తూ ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ తో పలు సక్సెస్ లతో ముందుకు సాగుతున్నారు. ఇక ఇటీవల ఒకే ఒక జీవితం మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మరొక విజయాన్ని అందుకున్న శర్వానంద్ అతి త్వరలో పెళ్ళికి సిద్ధం అవుతున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

హై కోర్ట్ లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని అతి త్వరలో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు అయిన రక్షిత రెడ్డి, శర్వానంద్ ల పెళ్ళికి సంబంధించి అతి త్వరలో ఇరు కుటుంబాల నుండి అధికారికంగా ప్రకటన కూడా రానుందట. కాగా అతి త్వరలో దేవదాస్, హీరో, శమంతకమణి సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు శర్వానంద్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు