సమీక్ష : తుఫాన్ – అవుట్ డేటెడ్ ఎమోషనల్ డ్రామా!

సమీక్ష : తుఫాన్ – అవుట్ డేటెడ్ ఎమోషనల్ డ్రామా!

Published on Aug 10, 2024 3:01 AM IST
Toofan Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 09, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్ తదితరులు.

దర్శకుడు: విజయ్ మిల్టన్

నిర్మాతలు : కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా

సంగీత దర్శకులు: అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ

సినిమాటోగ్రఫీ: విజయ్ మిల్టన్

ఎడిట‌ర్ : కె.ఎల్. ప్రవీణ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా తుఫాన్. ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

సలీమ్ (విజయ్ ఆంటోనీ) ఓ సీక్రెట్ ఏజెంట్. గతంలో ఓ మిషన్ లో భాగంగా తాను ప్రేమించిన అమ్మాయిని కోల్పోతాడు. దాంతో సలీమ్ జీవితం మారిపోతుంది. అలాంటి సలీమ్ ను చీప్ (శరత్ కుమార్) ఎవరికీ తెలియని ఓ ప్లేస్ లోకి తీసుకు వచ్చి, అక్కడే ఉండమంటాడు. ఐతే, ఆ ఊరిలో డాలీ (డాలీ ధనుంజయ) అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తూ.. జనాన్ని దోచుకుంటూ అవసరం వారిని చంపేస్తూ ముందుకు వెళ్తాడు. ఈ క్రమంలో సలీమ్ ఏం చేశాడు ?, డాలీకి ఎలా బుద్ధి చెప్పాడు ?, ఈ మధ్యలో సౌమ్య (మేఘా ఆకాష్) పాత్ర ఏమిటి ?, ఆమె లవ్ ట్రాక్ ఏమిటి ?, అలాగే సలీమ్ పై కెప్టెన్ (సత్యరాజ్) పాస్ చేసిన ఆర్డర్ ఏమిటి ?, సలీమ్ కథ చివరికి ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

‘సలీమ్’ అనే పాత్రలో విజయ్ ఆంటోనీ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ విజయ్ ఆంటోనీ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. విజయ్ ఆంటోనీ నటించిన విధానం ఆకట్టుకుంది. హీరోయిన్ గా మేఘా ఆకాష్ మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన శరత్ కుమార్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు.

మరో కీలక పాత్రలో నటించిన సత్యరాజ్ కూడా చాలా బాగా నటించాడు. డాలీ ధనుంజయ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. మురళీ శర్మ, పృథ్వీ అంబర్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు విజయ్ మిల్టన్ రాసుకున్న కొన్ని సీన్స్ అండ్ క్లైమాక్స్ ను డిజైన్ చేసిన విధానం బాగుంది. సీక్వెల్ కి లీడ్ ఇచ్చిన విధానం కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘తుఫాన్’లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక విజయ్ ఆంటోని పాత్రతో పాటు మిగిలిన మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో విజయ్ ఆంటోని క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

అయితే, దర్శకుడు విజయ్ మిల్టన్ పనితనం ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం, సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం వంటి ఎలిమెంట్స్ బాగాలేదు. మొత్తమ్మీద దర్శకుడు విజయ్ మిల్టన్ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు.

మొత్తానికి ఈ ఎమోషనల్ యాక్షన్ స్టోరీలో కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్ మాత్రమే బాగున్నాయి. ఇక మిగిలిన కంటెంట్ అంతా రొటీన్ గా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. విజయ్ ఆంటోని పాత్రను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి.. అంతే ఎఫెక్టివ్ గా ఆ పాత్రకి కాన్ ఫ్లిక్ట్ ను బిల్డ్ చేయాల్సింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు విజయ్ మిల్టన్ కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన తుఫాన్ స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకులు అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాతలు కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వీరి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘తుఫాన్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. కొన్ని ఎమోషన్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, కథాకథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అలాగే రెగ్యులర్ స్క్రీన్ ప్లేలో వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం మెప్పించలేకపోయింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు