IPL 2025: ఢిల్లీ జట్టుని గెలిపించిన ఈ అశుతోష్ ఎవరు?

Top 10 Innings of Ashutosh Sharma

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా లేటెస్ట్ గా ఢిల్లీ మరియు లక్నో జట్ల నడుమ జరిగిన మ్యాచ్ ఒక థ్రిల్లర్ అని చెప్పవచ్చు. దాదాపు మ్యాచ్ ఢిల్లీ చేతిలో నుంచి జారిపోతుంది అనే సమయంలో వచ్చాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా అశుతోష్. అయితే తాను వచ్చిన తర్వాత పది పదిహేను బంతులు వరకు నెమ్మదిగానే ఆడాడు కానీ ఊహించని విధంగా మ్యాచ్ ని తిప్పేసి ఢిల్లీకి పోయింది అనుకున్న విజయాన్ని తాను అందించాడు. అసలు ఈ ఆటగాడు ఎవరు తన బ్యాక్ స్టోరీ ఏంటో చూద్దాం.

అశుతోష్ శర్మ మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ అనే చిన్న ఊరి నుంచి వచ్చాడు. సెప్టెంబర్ 15, 1998న పుట్టాడు. పవర్ హిట్టర్లను చూసి ఆడటం నేర్చుకున్నాడు. 2023 సయ్యద్ ముష్టాక్ అలీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌తో 11 బంతుల్లో 50 చేసి యువరాజ్ సింగ్ రికార్డ్ బద్దలు కొట్టాడు. అది భారత ఆటగాడి వేగవంతమైన T20 ఫిఫ్టీ.

మొదట మిడిల్ ఆర్డర్‌లో ఆడినా, తర్వాత ధోని, రింకు సింగ్‌లా ఫినిషర్‌గా మారాడు. గత ఏడాది పంజాబ్ కింగ్స్ అతన్ని 20 లక్షలకు కొన్నది, అక్కడ 7 ఇన్నింగ్స్‌లో 189 పరుగులు (స్ట్రైక్ రేట్ 167.25) చేసాడు. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ 3.8 కోట్లకు తీసుకుంది. శిఖర్ ధవన్ అతనికి మార్గదర్శి, ఈ గెలుపును అతనికి అంకితం ఇచ్చాడు.

తన టాప్ 5 ఇన్నింగ్స్

1. (IPL 2025, మార్చి 23, 2025) 66 పరుగులు – 31 బంతులు vs లక్నో
– 210 చేజ్, 65/5 నుంచి గెలిపించాడు.
– 5 ఫోర్లు, 5 సిక్స్‌లు, SR 212.90.

2. (IPL 2024) 61 పరుగులు – 28 బంతులు పంజాబ్ vs ముంబై
– 183 చేజ్, 9 పరుగుల తేడాతో ఓడారు.
– 77/6 నుంచి దాదాపు గెలిపించాడు.

3. (SMAT 2023) 50 పరుగులు – కేవలం 11 బంతులు vs అరుణాచల్
– భారత వేగవంతమైన T20 ఫిఫ్టీ.
– SR 454.54 ఇక్కడే తనకోసం ఎక్కువ తెలిసింది.

4. (IPL 2024) 33 పరుగులు – 15 బంతులు vs హైదరాబాద్
– 182 చేజ్, 2 పరుగుల తేడాతో ఓడారు.
– చివర్లో వేగంగా ఆడాడు.

5. 31 – 17 బంతులు vs గుజరాత్ (IPL 2024)
– PBKS 200 చేసింది, అతని కాంట్రిబ్యూషన్ ఉపయోగపడింది.
– SR 182.35.

ప్రస్తుత ఢిల్లీ మ్యాచ్ విన్నింగ్ తో నెక్స్ట్ మ్యాచ్ లలో తనపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇదే ఫామ్ ని కానీ కొనసాగితే వచ్చే ఐపీఎల్ లో తనకి రికార్డు ధర దొరికినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.

Exit mobile version