తన సుస్వరాలతో భారతీయ ప్రేక్షకులను అలరించి ఆపై ఆస్కార్ సాధించి అంతర్జాతీయ లెవల్లో మన కీర్తిని చాటిన మ్యూజిక్ మెజీషియన్ ఏ.ఆర్ రెహమాన్. రెహమాన్ కి గత సంవత్సరం చాలా ఆనందకరంగా గడిచిందట. ఒకే ఏడాదిలో రెహమాన్ రెండు సార్లు రజినీ సినిమాలకు స్వరాలను అందించారు. విక్రమసింహా, లింగా సినిమాలు రెహమాన్ స్వర సారధ్యంలోనే రూపుదిద్దుకున్నాయి
ఇక ప్రపంచ ఖ్యాతి గడించిన భారతీయ ఆణిముత్యం శంకర్ ”ఐ” కి కూడా పనిచేయడం ఆనందకరంగా వుందని, మొత్తానికి 2014 లో మూడు హాలీవుడ్ సినిమాలతో కలిపి మొత్తం 12 సినిమాలు చేసినట్టు తెలిపాడు. ఇంతేకాక తీరిక సమయాలలో ఒక కధని రాస్తున్నట్టు దానికి తానే సహనిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు