ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఏప్రిల్ 4, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : నవదీప్, దీక్షిత్, కోమలి ప్రసాద్, సంచిత పూనాచా, పృథ్వీ రాజ్, ప్రమోదిని, దేవి ప్రసాద్ తదితరులు
దర్శకత్వం : రమణ తేజ
నిర్మాతలు : సునీతా తాటి, వంశీ బండారు
సంగీతం : మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ : గోకుల్ భారతి
ఎడిటర్ : అన్వర్ అలీ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
నవదీప్, దీక్షిత్, కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించిన థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘టచ్ మీ నాట్’ జియో హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 4న స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఎస్పీ రాఘవ్(నవదీప్), రిషి(దీక్షిత్) చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదంలో తమకు కావాల్సిన వారిని కోల్పోతారు. ఈ ప్రమాదంలో రిషికి ‘సైకో మెట్రీ’ అనే పవర్ వస్తుంది. కట్ చేస్తే, కొన్నేళ్లకు మరో ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు రాఘవ్ రిషి పవర్స్‌ను వాడాలనుకుంటాడు. ఈ ఇన్వెస్టిగేషన్‌లో గతంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అసలు ఈ ప్రమాదాల వెనుక ఉన్నది ఎవరు..? రాఘవ్ టీమ్ ఈ కేసును చేధిస్తారా..? రిషి తన పవర్స్‌తో ఏం చేస్తాడు..? అనేది ఈ వెబ్ సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ వెబ్ సిరీస్‌లో సైకో మెట్రీ అనే కొత్త కాన్సె్ప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, ఇలాంటి కొత్త పాయింట్‌కు కథను కూడా కొత్తగా ప్రెజెంట్ చేయాల్సింది. ఇక నవదీప్, దీక్షిత్ శెట్టి తమ పాత్రల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కథను సీరియస్ నోట్‌తో స్టార్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తి నెలకొంటుంది.
ఇక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లాలనే దర్శకుడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఇలాంటి వెబ్ సిరీస్‌లో కామెడీ పండటం విశేషం. ప్రేక్షకులను కామెడీ సీన్స్ నవ్విస్తాయి. కీలక పాత్రల్లోని ఎమోషన్, వారి మధ్య బంధాలను చక్కగా చూపెట్టారు. కొన్ని సీన్స్ ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుంటాయి. సంగీతపరంగా బీజీఎం స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఓ కొత్త కాన్సెప్ట్‌ను తీసుకున్నప్పుడు రొటీన్ కథ అయినా, దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయాల్సింది. కానీ, ఈ విషయంలో దర్శకుడు రమణ తేజ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మంచి కోర్ పాయింట్‌ను ఆయన పూర్తిగా వృథా చేసుకున్నాడు. రొటీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ కథను ముందుకు తీసుకెళ్లేందుకే ఆయన ప్రాధాన్యత చూపించినట్లు మనకు ఈ వెబ్ సిరీస్ చూస్తే అనిపిస్తుంది.
ఇందులో కూడా థ్రిల్లింగ్ అంశాలను పక్కనబెట్టి డ్రామాకే దర్శకుడు పెద్దపీట వేశాడు. దీంతో ప్రేక్షకులకు కొద్దిసేపటికే ఈ వెబ్ సిరీస్‌పై నెగిటివ్ ఫీలింగ్ కలుగుంది. ఇక ఒక ఎపిసోడ్ మొత్తాన్ని కేవలం పాత్ర పరిచయాలకే వాడేశారు. వెబ్ సిరీస్ రన్‌టైమ్ 3 గంటలే అయినా, ఇంకెంత సేపు అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది.
స్లో పేస్ కారణంగా దీని రన్‌టైమ్ లెంగ్తీగా అనిపిస్తుంది. అటు నటీనటుల పాత్రలను పక్కాగా డిజైన్ చేయడంలోనూ దర్శకుడు మిస్ ఫైర్ అయ్యాడు. రిషి లాంటి పాత్రను చాలా చక్కగా వాడాల్సింది. అసలు నవదీప్ పాత్రని ఎందుకు ఇంత డల్‌గా రాసారో ఎవరికీ అర్థం కాదు. ఒకట్రెండు ఎపిసోడ్స్ మినహా ఈ వెబ్ సిరీస్‌తో నీరసం తెప్పించారని చెప్పాలి.
సాంకేతిక వర్గం :
దర్శకుడు రమణ తేజ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్న, దాన్ని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే విషయంలోనూ దర్శకుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. మహతి స్వర సాగర్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా కథకు తగ్గట్టుగా సాగుతుంది. అయితే, ఎడిటింగ్ వర్క్ మాత్రం మరింత బెటర్‌గా ఉండాల్సింది.
తీర్పు :
ఓవరాల్‌గా ‘టచ్ మీ నాట్’ వెబ్ సిరీస్ ఓ చక్కటి పాయింట్‌తో మొదలై కథ ఎటు పోతుందో అనే రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నవదీప్, దీక్షిత్ శెట్టి తమ పర్ఫార్మెన్స్‌లతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ, కథలో ఎలాంటి గ్రిప్పింగ్ మూమెంట్స్ లేకపోవడం, డ్రామా ఎక్కువగా ఉండటం, స్లో పేస్ కారణంగా ఇది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లను ఇష్టపడేవారు దీన్ని స్కిప్ చేయడం బెటర్.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team