విడుదల తేదీ : సెప్టెంబర్ 12, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: టోవినో థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్, రోహిణి, హరీష్ ఉత్తమన్, నిస్తార్ సైత్, జగదీష్, ప్రమోద్ శెట్టి తదితరులు.
దర్శకుడు: జితిన్ లాల్
నిర్మాతలు : లిస్టిన్ స్టీఫెన్ మరియు జకరియా థామస్
సంగీత దర్శకుడు: ధిబు నినన్ థామస్
సినిమాటోగ్రఫీ: జోమోన్ టి. జాన్
ఎడిటర్ : షమీర్ మహమ్మద్
సంబంధిత లింక్స్: ట్రైలర్
మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ మూవీ ఏఆర్ఎం. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
అజయన్ (టోవినో థామస్) వంశంలో మగవాళ్ళు దొంగతనాలు చేస్తూ తమ జీవితాన్ని గడిపారు. ఆ వంశంలో పుట్టిన కారణంగా అజయన్ చిన్నతనం నుంచి ఊరిలో అందరి చేత అవమానింప బడుతూ ఉంటాడు. దొంగతనానికి తాను దూరంగా ఉన్నప్పటికీ, ఊరిలో జరిగే దొంగతనాలకు పోలీసులకు అజయన్ పైనే అనుమానం ఉంటుంది. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అజయన్ జీవితంలోకి అత్యంత విలువైన విగ్రహం వస్తోంది. ఎంతో చరిత్ర ఉన్న ఆ విగ్రహం కథ ఏమిటి ?, దానికోసం కుంజికేలు (మొదటి తరం టోవినో థామస్) చేసిన సాహసం ఏమిటి ?, అలాగే మణియన్ (రెండో తరం టోవినో థామస్) కథ ఏమిటి?, అతను సాధించింది ఏమిటి ?, చివరకు అజయన్ కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది?, ఈ మధ్యలో కృతి శెట్టితో అజయన్ ప్రేమ కథ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
మూడు కాలాలని జోడిస్తూ మూడు క్యారెక్టర్స్ ను ఇంటర్ లింక్ చేస్తూ దర్శకుడు కొన్ని చోట్ల ప్లేను బాగా డిజైన్ చేశాడు. అలాగే, మణియన్, అజయన్, కుంజికేలు.. ఇలా మూడు పాత్రల్లో నటించిన టోవినో థామస్.. అద్భుతంగా నటించాడు. తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే
టోవినో థామస్ ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ తీవ్రమైన భావోద్వేగాలతో పాటు అద్భుత పోరాటాల్లోనూ టోవినో తన మార్క్ నటనతో హైలెట్ గా నిలిచారు.
మరో కీలక పాత్రలో నటించిన సురభి లక్ష్మి చాలా చక్కగా నటించింది. ఆమెకు – టోవినో థామస్ కు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయి. మొత్తానికి ఆమెకు గుర్తు పెట్టుకునే పాత్ర ఈ చిత్రంలో దక్కింది. హీరోయిన్ పాత్రలో కృతి శెట్టి కూడా బాగానే నటించింది. అలాగే ఐశ్వర్య రాజేష్, బాసిల్ జోసెఫె తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నిస్తార్ సైత్, జగదీష్, ప్రమోద్ శెట్టి లతో పాటు ఇతర కీలక పాత్రలను పోషించిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు జితిన్ లాల్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ చాలా బాగున్నాయి. కథా నేపథ్యం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది.
మైనస్ పాయింట్స్ :
అజయన్ పాత్రను, ఆ పాత్ర తాలూకు వంశం సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో – విలన్ మధ్య మైండ్ గేమ్ ని ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే ఆ విగ్రహం ట్రాక్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది.
మొత్తానికి క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు జితిన్ లాల్ మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తమ్మీద హీరో క్యారెక్టరైజేషన్, బీజీఎం బాగున్నప్పటికీ.. సినిమా మాత్రం యావరేజ్ గానే అనిపిస్తుంది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు జితిన్ లాల్ తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు ధిబు నినన్ థామస్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ షమీర్ మహమ్మద్ తగ్గించాల్సింది. నిర్మాతలు లిస్టిన్ స్టీఫెన్ మరియు జకరియా థామస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘ఏఆర్ఎం’ అంటూ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. టోవినో థామస్ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్, అలాగే
కొన్ని పీరియాడిక్ థ్రిల్లింగ్ ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయి. ఐతే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా కొన్ని పీరియాడిక్ యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team