ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల సందడి నెలకొంది. ఈ సంక్రాంతికి ఏకంగా మూడు బడా చిత్రాలు పోటీ పడుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాలపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈసారి ఇద్దరు సీనియర్ హీరోలు, ఓ యంగ్ హీరో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాడు. నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మూడు సినిమాల్లో వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కు సాలిడ్ రెస్పాన్స్ లభించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర యనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ట్రైలర్‌ను జనవరి 6న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ ట్రైలర్ లాంచ్‌ను నిజామాబాద్‌లోని కలెక్టర్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఈమేరు ఓ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ ట్రైలర్ ఎలాంటి ఎంటర్‌టైనింగ్ కంటెంట్‌తో వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.