ఈ ఆగస్ట్ లో మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేష లో వస్తున్న మరో చిత్రం “మిస్టర్ బచ్చన్” కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో రవితేజ సరసన నటించిన యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ కోసమే గత కొన్నాళ్ల నుంచి మన టాలీవుడ్ లో ట్రెండింగ్ గా వార్తలు వినిపిస్తున్నాయి.
తన అందంతో అదరగొట్టిన ఈమె ఈ సినిమాలో సాంగ్స్ లో ఇప్పటికే అదరగొట్టింది. అయితే ఇప్పుడు సినిమా దగ్గరకి వస్తున్న తరుణంలో సినిమాకి ఆమె తన ఫైనల్ వర్క్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా రివీల్ చేసింది. ఆమె ఈ సినిమాకి మొత్తం డబ్బింగ్ వర్క్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలిపింది. మరి ఈమె మొదటి సినిమాకే తెలుగు డబ్బింగ్ స్వయంగా ఆమెనే పూర్తి చేసుకోవడం విశేషం. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.