రిలీజ్ కి రెడీ అయిన ట్రయాంగిల్ లవ్ స్టొరీ “దిల్ సే”

శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై అభినవ్ మదిశెట్టి , స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా మంకల్ వీరేంద్ర , రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా దిల్ సే. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్ట్ 4న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్ రెండు కన్నులతో కు మంచి స్పందన లభించింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట 2 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ సంగీతం అందించాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా దిల్ సే ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఒన్ మీడియా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబోతోంది.

కంటెట్ ఉన్న చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. యూత్ లవ్ స్టోరీస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అదే విధంగా ఈ దిల్ సే సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

Exit mobile version