ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనిమల్ బ్యూటీ లేటెస్ట్ సినిమా

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన వైలెంట్ యాక్షన్ డ్రామా “అనిమల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాతో భారీ ఫేమ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి నటించిన రీసెంట్ అడల్ట్ కామెడీ డ్రామా చిత్రమే “బ్యాడ్ న్యూజ్”. ఇటీవల బాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి హైప్ రేపిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి హిట్ కూడా అయ్యింది.

టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా కొన్ని రోజులు కితమే ఓటీటీలో రెంటల్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం ఫ్రీగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. రెంటల్ కి తీసుకొచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే ఈ సినిమా నేటి నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ అడల్ట్ కామెడీ డ్రామా చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రాన్ని ఆనంద్ తివారి దర్శకత్వం వహించగా కరణ్ జోహార్ నిర్మాణం వహించారు.

Exit mobile version