యానిమల్ మూవీతో త్రిప్తి డిమ్రీ ఓవర్ నైట్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆమె అంతకుముందు కొన్ని మంచి సినిమాల్లో నటించినప్పటికీ, యానిమల్ చిత్రంతో సూపర్ క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుండి, త్రిప్తి రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి చాలా పుకార్లు వచ్చాయి. బాలీవుడ్ బిగ్గీ ఆషికీ 3లో త్రిప్తి దిమ్రీ లేడీ లీడ్ రోల్ లో ఎంపికైనట్లు తాజా వార్త. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా కనిపించనున్నారు.
ఈ ఫ్రాంచైజీ ప్రేక్షకులలో బాగా ప్రాచుర్యం పొందింది. కార్తిక్ ఆర్యన్ మరియు త్రిప్తి డిమ్రీల కలయికతో ఆషికీ 3 ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. త్రిప్తి డిమ్రీ ప్రభాస్ స్పిరిట్‌లో భాగమని కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే నటి వాటిని తోసిపుచ్చింది. బర్ఫీ మరియు లూడో దర్శకుడు అనురాగ్ బసు ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాకి దర్శకత్వం వహించనున్నారు. T-సిరీస్‌కు చెందిన భూషణ్ కుమార్ ఈ సినిమా ను నిర్మించనున్నారు. అతి త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.