మ్యారేజ్ ప్లాన్స్ పై త్రిప్తి డిమ్రీ కామెంట్స్!

మ్యారేజ్ ప్లాన్స్ పై త్రిప్తి డిమ్రీ కామెంట్స్!

Published on Jan 31, 2024 5:05 PM IST

యానిమల్ విడుదల తర్వాత, త్రిప్తి డిమ్రీ సంచలనంగా మారింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. మీడియా కూడా ఇంటర్వ్యూల కోసం ఆమెను వెంబడించడంతో పాటు ప్రతి ఈవెంట్‌లోనూ ఆమె హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో, త్రిప్తిని పెళ్లి గురించి అడిగారు. ఇప్పటికిప్పుడు తన పెళ్లి గురించి ఆలోచించడం లేదని, కెరీర్‌ను నిర్మించుకోవడంపైనే దృష్టి పెడుతున్నానని త్రిప్తి చెప్పింది.

తన కాబోయే భర్త ఎలా ఉండాలి, అతని నుండి ఆమె ఏమి కోరుకుంటుంది అని అడిగినప్పుడు, ఇలా చెప్పింది. అతను మంచి మనిషి అయితే చాలు అని, డబ్బు మరియు కీర్తి అవే వస్తాయి అంటూ చెప్పుకొచ్చింది. చాలా మందికి తెలియదు కానీ గత కొన్ని నెలల్లో అత్యధికంగా గూగుల్ చేసిన వ్యక్తులలో త్రిప్తి ఒకరు. త్రిప్తీకి అనేక ఆఫర్లు వస్తున్నాయి, మరియు ఆమె ఇప్పటికే హిందీలో కొన్ని ప్రాజెక్ట్‌లకు సంతకం చేసిందని, రాబోయే రోజుల్లో వాటిని ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు