‘బ్యాడ్ న్యూస్’ ప‌ట్టుకొచ్చిన ‘యానిమ‌ల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రి

బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్ సింగ్ న‌టించిన ‘యానిమ‌ల్’ మూవీ బాక్సాఫీస్ ను ఏ విధంగా షేక్ చేసిందో మ‌నం చూశాం. ఈ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చేసింది అందాల భామ త్రిప్తి డిమ్రి. ‘యానిమ‌ల్’ లో బోల్డ్ సీన్స్ లో న‌టించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఓ ‘బ్యాడ్ న్యూస్’ను త‌న అభిమానుల‌కు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది.

త్రిప్తి నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాడ్ న్యూస్’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో విక్కీ కౌశ‌ల్, అమీ విర్క్, నేహా దుపియాలు కూడా ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రమోష‌న్స్ ను చిత్ర యూనిట్ ఇప్ప‌టికే స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే త్రిప్తి ‘బ్యాడ్ న్యూస్’ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ సినిమాను జూలై 19న రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

గ‌తంలో ‘గుడ్ న్యూస్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత‌లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక పూర్తి కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రానున్న ఈ సినిమాను ఆనంద్ తివారి డైరెక్ట్ చేశారు. ఇక ఈ చిత్ర ట్రైల‌ర్ ను జూన్ 28న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

Exit mobile version