ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). ఈ చిత్రం ను ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.
ఈ చిత్రం లో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ అయిన త్రిప్తి డిమ్రి ను మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ లో సమంత తో ఊ అంటావా మామ సాంగ్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ అధ్బుతమైన సంగీతం అందించారు. బన్నీ తో మాస్ డాన్స్ వేసేందుకు త్రిప్తి డిమ్రి రెడీ అయినట్లు తెలుస్తొంది. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ జూన్ లో చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, ఫహాద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.