ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన త్రిష లేటెస్ట్ థ్రిల్లర్ “ఐడెంటిటీ”

ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన త్రిష లేటెస్ట్ థ్రిల్లర్ “ఐడెంటిటీ”

Published on Jan 31, 2025 8:06 AM IST

టాలీవుడ్ సహా కోలీవుడ్ లో మంచి ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్ లలో నటి త్రిష కూడా ఒకరు. మరి త్రిష హీరోయిన్ గా ప్రముఖ మళయాళ టాలెంటెడ్ హీరో టోవినో థామస్ హీరోగా దర్శకులు అనాస్ ఖాన్ అలాగే అఖిల్ పాల్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ మళయాళ థ్రిల్లర్ సినిమానే “ఐడెంటిటీ”. మరి మళయాళ వెర్షన్ లో పర్వలేదనిపించిన ఈ సినిమాని తెలుగులో కూడా థియేటర్లులో రిలీజ్ కి అనౌన్స్ చేశారు కానీ సరైన ప్రమోషన్స్ లేక సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.

దీనితో ఆ వెంటనే ఓటీటీ డేట్ కూడా బయటకి వచ్చేసింది. మరి లేటెస్ట్ గా ఈ సినిమా నేటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి కూడా వచ్చేసింది. ఈ సినిమాని స్ట్రీమింగ్ యాప్ జీ5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈరోజు నుంచి మళయాళ వెర్షన్ లోనే కాకుండా తెలుగు డబ్ లో కూడా వచ్చింది. మరి ఈ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారు జీ5 లో ట్రై చేయవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు