ఆకట్టుకుంటున్న త్రిష “బృంద” ట్రైలర్‌!

ఆకట్టుకుంటున్న త్రిష “బృంద” ట్రైలర్‌!

Published on Jul 21, 2024 6:00 PM IST

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ బృంద వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతోంది. సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో ప్రసారం కానుంది. ఆగస్ట్ 2, 2024 నుండి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. మేకర్స్ తాజాగా ట్రైలర్‌ని విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ చాలా ఆసక్తికరం గా సాగింది. త్రిష సస్పెండ్ చేయబడిన SI పాత్రను పోషిస్తుంది. తను ఒక భయంకరమైన క్రైమ్ కేసులో చిక్కుకుంది. ఈ వెబ్ సిరీస్ SI బృంద ఈ కేసును ఛేదించడానికి మరియు ఈ హేయమైన చర్యల వెనుక ఉన్న సూత్రధారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తుంది.

ఈ సిరీస్ డ్రామా, క్రైమ్ మరియు మిస్టరీ లతో ఆకట్టుకోనుంది. ఇంద్రజిత్ సుకుమారన్, జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాడ్డింగ్ అడ్వర్టైజింగ్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కొల్లా ఆశిష్ నిర్మించిన ఈ సిరీస్‌లో శక్తి కాంత్ కార్తీక్ అద్భుతమైన స్కోర్ మరియు పాటలు ఉన్నాయి. తెలుగు సిరీస్ తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ మరియు హిందీ భాషలలో కూడా అందుబాటులో ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు