టాప్ గేర్లో త్రిష.. సైన్ చేసినవన్నీ పెద్ద సినిమాలే

టాప్ గేర్లో త్రిష.. సైన్ చేసినవన్నీ పెద్ద సినిమాలే

Published on Oct 17, 2019 11:17 PM IST

త్రిష.. కెరీర్ ఇక ముగింపు దశకు చేరుకుంది అనుకునే సమయానికి ఎంచుకునే సినిమాల ట్రెండ్ మార్చి మళ్లీ స్పీడ్ అందుకుంది. 96 సినిమాతో అయితే ఆమెకు మునుపటి స్టార్ డమ్ వచ్చేసిందనే అనాలి. ఈ విజయంతో ఆమెకు పెద్ద సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. లేడీ ఒరియెంటెడ్ సబ్జెక్ట్స్ రాసుకున్న యువ దర్శకులు, పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనుకునే దర్శక నిర్మాతలు త్రిష వైపే చూస్తున్నారు. వాటికి కూడా సెలెక్టివ్ పద్దతిలోనే సైన్ చేస్తోంది ఆమె.

ప్రస్తుతం అమె చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మణిరత్నం చేస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో ఒక కీలక రోల్ చేస్తున్న త్రిష మలయాళంలో జీతు జోసెఫ్ డైరెక్షన్లో మొహాన్ లాల్ హీరోగా చేయనున్న సినిమాలో కూడా త్రిష నటించనుంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్టులో కూడా త్రిష కథానాయిక అనే వార్తలు వినబడుతున్నాయి.

ఇవి కాకుండా ఇంకా ఆమె సైన్ చేయాల్సిన, వినాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయట. ఇంకో రెండు హిట్లు గనుక పడితే ఇపుడప్పుడే ఆమె వెనక్కి తిరిగి చూసుకునే పరిస్తితి ఉండదు. మొత్తానికి త్రిష మరిసారి సౌత్ టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు