సినిమాలకు బ్రేక్ ఇస్తున్న త్రిష.. ఎందుకో తెలుసా?

స్టార్ బ్యూటీ త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ త్రిష తన అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే, ఇప్పటికే పలు క్రేజీ సినిమాల్లో నటిస్తున్న త్రిష, ఇప్పుడు ఒక్కసారిగా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు పేర్కొంది. దీనికి ఓ బలమైన కారణం కూడా ఉందని ఆమె పేర్కొంది.

తన పెంపుడు కుక్క జోర్రో మరణించిందని.. దాని మరణాన్ని తమ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నామని.. అందుకే, తాను కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా త్రిష వెల్లడించింది. ఈ వార్తతో త్రిష అభిమానులు కూడా విచారం వ్యక్తం చేశారు.

అయితే, ఆమెకు తన పెంపుడు కుక్క అంటే ఎంత ప్రేమ ఉందో ఈ నిర్ణయాన్ని బట్టి చెప్పొచ్చని వారు అంటున్నారు. ఇక తెలుగుతో పాటు తమిళ్‌లోనూ పలు క్రేజీ చిత్రాల్లో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version