‘స్పిరిట్’ కోసం ఆ హీరోయిన్ ను పట్టుకొస్తున్నారా..?

‘స్పిరిట్’ కోసం ఆ హీరోయిన్ ను పట్టుకొస్తున్నారా..?

Published on Aug 5, 2024 6:03 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రీసెంట్ గా ‘క‌ల్కి 2898 AD’తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ సైఫై మ‌థాల‌జి మూవీగా తెర‌కెక్కించిన తీరు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. అయితే, ఇప్పుడు ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల‌పై ఫోక‌స్ పెట్టాడు.

ఇప్ప‌టికే ”ది రాజా సాబ్” చిత్రాన్ని రెడీ చేస్తోన్న ప్ర‌భాస్, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ష‌న్ లో ”స్పిరిట్” అనే సినిమాను తెరకెక్కించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇప్పటికే కొరియ‌న్ న‌టుడు డోంగ్ లీ ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తాడ‌నే టాక్ వినిపించ‌గా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ త్రిష న‌టించ‌బోతుంద‌ని తెలుస్తోంది.

గ‌తంలో ప్ర‌భాస్ తో ఏకంగా మూడు సినిమాలు చేసిన త్రిష, ఇప్పుడు నాలుగోసారి ఆయ‌న‌తో జోడీ క‌ట్ట‌నుంద‌ట‌. ఈ పెయిర్ అయితే బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు కూడా భావిస్తున్నారు. మ‌రి నిజంగానే ”స్పిరిట్” మూవీలో త్రిష హీరోయిన్ గా న‌టిస్తుందా అనేది తెలియాలంటే అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసే వ‌ర‌కు వెయిట్ చేయాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు