నిశ్చితార్ధం అయ్యాక కూడా త్రిష సినిమాల జోరుకి అడ్డుకట్ట పడడంలేదు. వరుసపెట్టి కొత్త ప్రాజెక్ట్ లను అంగీకరిస్తూ వస్తున్న త్రిష తాజా సమాచారం ప్రకారం ఒక కొత్త హర్రర్ సినిమాను అంగీకరించింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభినయం చేయనుంది. లవ్ యు బంగారమ్ ఫేమ్ గోపీ ఈ సినిమాను తమిళ, కన్నడ భాషలలో తెరకెక్కించనున్నాడు. నాగ శౌర్య నటించిన లక్ష్మిరావే మా ఇంటికి సినిమాను నిర్మించిన మామిడిపల్లి గిరిధర్ ఈ చిత్రానికి నిర్మాత. మే నుండి షూటింగ్ ప్రారంభంకానుంది


