త్రివిక్రమ్ భారీ ప్లాన్.. బన్నీతో ఎవరికీ తెలియని ప్రయత్నం!

త్రివిక్రమ్ భారీ ప్లాన్.. బన్నీతో ఎవరికీ తెలియని ప్రయత్నం!

Published on Mar 25, 2025 2:59 PM IST

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్డం పతాక స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి రాజమౌళి బ్రాండ్ లేకుండా ఇక స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ అండ్ మార్కెట్ ని చూపించి బ్రాండ్ గా నిలిచాడు. అయితే అల్లు అర్జున్ నుంచి నెక్స్ట్ పుష్ప 2 సినిమా తర్వాత పలు భారీ సినిమాలే ఉండగా వాటిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న భారీ చిత్రం కూడా ఒకటి.

నిజానికి పుష్ప 2 తర్వాత ఇదే స్టార్ట్ కావాల్సి ఉంది కానీ ఇపుడు దీనిని అట్లీ ప్రాజెక్ట్ రీప్లేస్ చేస్తుంది. అయితే లేటెస్ట్ గా త్రివిక్రమ్ తో సినిమా విషయంలో నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ తో తాము ఇండియన్ సినిమా దగ్గర ఎవరూ టచ్ చెయ్యని మైథాలజీ సబ్జెక్టుతో సినిమాని చాలా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా తాను రివీల్ చేశారు.

ఒక్కసారి ఆ సినిమా వచ్చాక యావత్ భారతదేశం ఈ సినిమా వైపు చూస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఇది మహాభారతం లేదా రామాయణంకి సంబంధించిన కథ కాదు అని మన ఇతిహాసాల్లోనే ఎవరికీ తెలియని ఒక కొత్త పాత్రతో తాము చేస్తున్నట్టుగా తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు అభిమానుల్ని మరింత ఎగ్జైట్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు