ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన త్రివిక్రమ్..!

Published on Jul 7, 2020 11:06 pm IST


ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కమిట్ కాగా, త్వరలో సెట్స్ పైకి వెళ్లాల్సివుంది. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ లోనే షూట్ మొదలుకావాల్సి ఉండగా, లేటవుతుంది. లాక్ డౌన్ సమయంలో ఎన్టీఆర్ మూవీ కోసం నటీనటులను ఫైనల్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ లేదు. అనేక మంది హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటనైతే రాలేదు.

ఈ మూవీ కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ బాలీవుడ్ హీరోయిన్స్ పైనే ద్రుష్టి పెట్టారని సమాచారం. బాలీవుడ్ భామనే ఫైనల్ చేయాలని డిసైడ్ అయిన ఆయన కసరత్తు మొదలుపెట్టాడట. బాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న ఓ యంగ్ హీరోయిన్ కోసం ఆయన వెతుకుతున్నాడట. మరి ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్ దక్కించుకునే ఆ లక్కీ లేడీ ఎవరో చూడాలి.

సంబంధిత సమాచారం :

More