తమిళ్ “ఖుషి” vs తెలుగు “ఖుషి”.. దర్శకుడే తేల్చేసాక ఇంకా డిస్కషన్ అవసరమా?

తమిళ్ “ఖుషి” vs తెలుగు “ఖుషి”.. దర్శకుడే తేల్చేసాక ఇంకా డిస్కషన్ అవసరమా?

Published on Aug 25, 2024 7:08 PM IST

లేటెస్ట్ గా కోలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి. ఆమె నటించిన సాలిడ్ ప్రాజెక్ట్ “సరిపోదా శనివారం” ఈవెంట్ లో నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్యతో తాను చేస్తే “ఖుషి 2” సినిమా ఒక్క పవన్ కళ్యాణ్ తోనే చెయ్యాలి అని చేసిన కామెంట్స్ తెలుగులో మంచి వైరల్ గా మారాయి. కానీ తమిళ ఆడియెన్స్ కి మాత్రం ఈ కామెంట్ ఎక్కడో తగిలాయి.

అయితే మెయిన్ గా విజయ్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ ని తీసుకోలేకపోతున్నారు. తెలుగు ఖుషి కంటే తమిళ్ ఖుషి నే బెటర్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రియాంకపై ట్రోల్స్ చేస్తూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ రెండు సినిమాలని దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్యనే తమిళ్ ఖుషి కంటే తెలుగు ఖుషి పెద్ద హిట్ అయ్యింది దానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి.

మరి వాటికి తమిళ్ ఆడియెన్స్ ఏం చెప్తారో చూడాలి. తమిళ్ లో ఖుషి హిట్ అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ చేసిన చిన్న చిన్న మార్పులు చేర్పులు మూలాన సూపర్ డూపర్ హిట్ అయ్యింది అని అది కలెక్షన్స్ పరంగా కూడా అని ఎస్ జె సూర్య గతంలోనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సో దర్శకుడే తమిళ్ లో కంటే తెలుగులోనే పెద్ద హిట్ అని చెప్పాక ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయడం అనవసరమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు