ఊర్వశి రౌతేలా మరియు ఈ క్రికెటర్ మధ్య కొనసాగుతోన్న మాటల యుద్ధం!

Published on Aug 12, 2022 3:09 pm IST

మాజీ ప్రపంచ సుందరి ఊర్వశి రౌతేలా ఇటీవలే ది లెజెండ్‌తో దక్షిణ భారతంలోకి అడుగుపెట్టింది. ఒక ఇంటర్వ్యూలో, నటి కమ్ మోడల్ మాట్లాడుతూ, R.P. అనే వ్యక్తి తనను కలవడానికి దాదాపు 10 గంటలు వేచి ఉన్నాడని మరియు వారణాసిలో షూటింగ్ చేస్తున్నప్పుడు తనకు 17 మిస్డ్ కాల్స్ ఇచ్చాడని పేర్కొంది. ఊర్వశి గతంలో క్రికెటర్ రిషబ్ పంత్‌తో డేటింగ్ చేసిన విషయం చాలా మందికి తెలుసు.

దీనిపై స్పందిస్తూ, భారత వికెట్ కీపర్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో, కేవలం పాపులారిటీ కోసం ప్రజలు ఇంటర్వ్యూ లలో ఎలా అబద్ధాలు చెబుతారనేది తమాషాగా ఉంది అని అన్నారు. కొన్ని నిమిషాల్లో, క్రికెటర్ స్టోరీని తొలగించాడు. కానీ ఇప్పుడు విషయాలు మరింత వేడెక్కాయి. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తుంది. నటి తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక పోస్ట్‌తో అతనికి రిప్లై ఇచ్చింది. అందులో ఛోటు భయ్యా బ్యాట్ బాల్ ఆడాలి అని రాసి ఉంది. ఆమె అతన్ని కౌగర్ హంటర్ అని పేర్కొనడం జరిగింది. అతనికి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది హీరోయిన్. మౌనంగా ఉన్న అమ్మాయిని ఉపయోగించుకోవద్దు అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జోడించడం జరిగింది. వీటన్నింటిలో ఇద్దరూ తమ పేర్లను బయటకు తీయలేదు.

సంబంధిత సమాచారం :