మన ఇండియన్ సినిమా దగ్గర పలు కల్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన సెన్సేషనల్ హారర్ చిత్రాల్లో బాలీవుడ్ అండర్ రేటెడ్ చిత్రం “తుంబాడ్” కూడా ఒకటి. దర్శకుడు అనీల్ రాహి బర్వె తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో థియేటర్స్ లో హిట్ కాలేకపోయింది కానీ తర్వాత మాత్రం క్రేజీ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది.
దీనితో ఈ సినిమాని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ కి థియేటర్స్ లో తీసుకురాగా ఇప్పుడు ఈ చిత్రం సాలిడ్ రన్ ని ఇండియాలో కనబరుస్తుంది అని చెప్పాలి. గత సెప్టెంబర్ 13 న థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా ఆ వారం రెండో వారం కూడా పూర్తి చేసుకొని మూడో వారం థియేటర్స్ లో రన్ ని కంటిన్యూ చేస్తుంది.
మరి ఇప్పుడు మూడో వారానికి కూడా తుంబాడ్ స్ట్రాంగ్ వసూళ్లతో దూసుకెళ్తుంది అని చెప్పాలి. నిన్న వర్కింగ్ డే సోమవారం కూడా ఈ చిత్రం 1 కోటికి పైగా నెట్ వసూళ్లు ఇండియా వైడ్ గా ఒక్క హిందీలోనే అందుకొని ఇప్పుడు వరకు 22.6 కోట్లకి పైగా నెట్ వసూళ్లతో స్ట్రాంగ్ గా వెళుతుంది. దీనితో ఇండియాలో రీ రిలీజ్ చిత్రాల్లో పెద్ద హిట్ గా నిలిచే దిశగా ఇది వెళుతుంది అని చెప్పొచ్చు. ఫైనల్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.