ఫైటర్’ షూట్ కోసం ట్యూన్స్ స్టార్ట్ చేశాడు !

Published on Aug 10, 2020 9:24 pm IST


డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఫైటర్’ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు పని చేస్తున్నాడు. కానీ ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తుండటంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి మంచి మార్కెట్ రావాలనే ఉద్దేశ్యంతో.. ఈ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నారని ఇటివలే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం మణిశర్మ మ్యూజిక్ ను స్టార్ట్ చేశారు. తదుపరి షెడ్యూల్ లోసాంగ్స్ షూట్ చేయాలని పూరి ప్లాన్ చేస్తున్నాడు. ఆ సాంగ్స్ కోసమే మణిశర్మ ఇప్పుడు ట్యూన్స్ కంపోజ్ చేసే పనిలో ఉన్నాడు.

కాగా క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More