బిత్తిరి సత్తి తుపాకి రాముడు టీజర్ చూశారా…!

బిత్తిరి సత్తి తుపాకి రాముడు టీజర్ చూశారా…!

Published on Oct 18, 2019 5:20 PM IST

టెలివిషన్ కార్యక్రమాలలో తింగరా మాట్లాడి బిత్తిరి సత్తిగా ఫేమస్ అయిన సత్తి కొద్దిరోజులుగా సినిమాలలో కూడా కమెడియన్ వేషాలు దక్కించుకుంటున్నాడు.కాగా ఆయన తుపాకీ రాముడు చిత్రంతో హీరోగా కూడా మారిపోనున్నాడు. రసమయి బాలకృష్ణ నిర్మాతగా టి. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ నేడు విడుదలైంది. యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ టీజర్ ని విడుదల చేయడం విశేషం.

ఈ మూవీ టీజర్ ని విడుదల చేసిన విజయ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సత్తి ఈ మూవీలో అటు కామెడీతో పాటు, సీరియస్ యాంగిల్ కూడా చూపించాడని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కొద్దిరోజులలో ట్రైలర్ విడుదల చేయడంతో పాటు చిత్ర విడుదల తేదీ ప్రకటిస్తారని సమాచారం. బిగ్ బాస్ ప్రస్తుత కంటెస్టెంట్ శివ జ్యోతితో ఆయన కలిసి చేసిన తీన్మార్ ప్రోగ్రాం తో ఈయన పాపులర్ ఐయ్యారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు