‘వీ లవ్ వైజాగ్’ రైట్స్ కోసం పోటీ పడుతున్న టాప్ 4 టీవీఛానల్స్

‘వీ లవ్ వైజాగ్’ రైట్స్ కోసం పోటీ పడుతున్న టాప్ 4 టీవీఛానల్స్

Published on Oct 28, 2014 1:15 PM IST

tv-channels
హుదూద్ తుఫాన్ వల్ల వైజాగ్ మరియు ఉత్తరాంధ్రని బాగా దెబ్బతిన్న ఉత్తరాంధ్ర బాధితుల్ని ఆదుకోవడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటైంది. బాధితులందరికీ మేమున్నాం అంటూ సాయం చెయ్యడం కోసం అందరూ కలిసి ‘వీ లవ్ వైజాగ్’ అనే కార్యక్రమం నిర్వహించనున్నారని ఇది వరకే తెలియజేశాం. ఈ వేడుక నవంబర్ 9న హైదరాబాద్ లో జరగనుందని, ఇది 13 గంటల పాటు కంటిన్యూగా జరిగే లైవ్ ప్రోగ్రాం అని మేము నిన్ననే తెలియజేశాం.

ప్రస్తుతం ఈ ‘వీ లవ్ వైజాగ్’ ప్రోగ్రాం లైవ్ ప్రసారం చేసే రైట్స్ కోసం తెలుగులో నాలుగు టాప్ 4 ఎంటర్టైనింగ్ చానల్స్ అయిన ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ మరియు జీ టీవీ పోటీ పడుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఎవరికో డైరెక్ట్ గా ఈ రైట్స్ ఇచ్చేయకుండా బిడ్డింగ్ ద్వారా ఓ చానల్ ని ఎంపిక చేయనున్నారు. ఈ లైవ్ ప్రోగ్రాం లైవ్ స ద్వారా సుమారు 3.5 కోట్ల రూపాయలను చిత్ర పరిశ్రమ ఆశిస్తోంది.

మీ అభిమాన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ బాబు మొదలైన అందరు హీరోలు హాజరు కానున్నారు. అందులో పలువురు హీరోలు లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి నిర్వహించనున్న ‘వీ లవ్ వైజాగ్’ వేడుక గురించిన మరిన్ని ప్రత్యేకమైన విశేషాలు ఎప్పటికప్పుడు మీకందజేస్తూనే ఉంటాం. దానికోసం కంటిన్యూ గా123telugu.com ని విజిట్ చేస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు