ట్విస్ట్.. మరి “బంగార్రాజు 2” లేనట్టేనా?

ట్విస్ట్.. మరి “బంగార్రాజు 2” లేనట్టేనా?

Published on Apr 30, 2024 12:02 PM IST


మన టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) నటించిన రీసెంట్ హిట్ చిత్రం “నా సామిరంగ” (Naa Saamiranga) తన కెరీర్ లో మరో మంచి గ్రాసర్ గా నిలిచి అదరగొట్టింది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా ఈ చిత్రానికి పని చేసాడు. అయితే ఈ సినిమా కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది అని ఇప్పుడు గట్టి బజ్ వినిపిస్తుంది. అయితే ప్రతి సంక్రాంతికి తన సినిమాలు తెస్తున్న నాగ్ వచ్చే ఏడాది కూడా వస్తున్నా అని కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇది దాదాపు తన హిట్ ఫ్రాంచైజ్ “బంగార్రాజు” (Bangarraju 2) సీక్వెల్ అనే అనుకున్నారు. అయితే ఇపుడు ట్విస్ట్ ఈ సినిమా లేనట్టు తెలుస్తుంది. విజయ్ బిన్నీతో చేసే మరో సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండనుందట. మరి బంగార్రాజు సీక్వెల్ ని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రెడీ చేసారో లేదో లేక మరో సమయానికి ప్లాన్ చేసారా అనేది కాలమే నిర్ణయించాలి. ఇక ప్రస్తుతం విజయ్ బిన్నీ అయితే మెగాస్టార్ “విశ్వంభర” లో పలు సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు