రీసెంట్ గా యువతని అలరించేందుకు వచ్చిన చిత్రాల్లో యువ హీరో పవీష్ నారాయణన్ హీరోగా అనికా సురేంద్రన్ హీరోయిన్ గా స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “జాబిలమ్మ నీకు అంత కోపమా” కూడా ఒకటి. అయితే తమిళ్ సహా తెలుగులో డీసెంట్ అనిపించుకున్న ఈ సినిమా ఇటీవల తమిళ్ లో ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి రాగా తెలుగులో కూడా ఇందులోనే వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇపుడు లేటెస్ట్ ట్విస్ట్ బయటకి వచ్చింది. ఈ సినిమా తెలుగు హక్కులు సింప్లి సౌత్ ఓటీటీ దగ్గర ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అతి త్వరలో తమ నుంచి వరల్డ్ వైడ్ గా(ఇండియాలో కాకుండా) ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నట్టు అప్డేట్ అందించారు. మరి ఇండియాలో తెలుగు వెర్షన్ పై ఇంకా సస్పెన్స్ గానే ఉంది అని చెప్పాలి.