ఓటిటిలో ఉపేంద్ర ‘యూఐ’ ట్విస్ట్!?

ఓటిటిలో ఉపేంద్ర ‘యూఐ’ ట్విస్ట్!?

Published on Apr 15, 2025 11:01 AM IST

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అన్నా ఉపేంద్ర తెరకెక్కించే సినిమాలన్నా మన తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో ఏళ్ల కితమే అడ్వాన్స్డ్ సినిమాలు తెరకెక్కించిన హీరో కం దర్శకుడు ఉపేంద్ర కాగా తన నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమానే ‘యూఐ’. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో కన్నడ సహా తెలుగు ఆడియెన్స్ కి కూడా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ని అందించింది.

ఇలా థియేటర్స్ రిలీజ్ తర్వాత ఇంత కాలం అయినప్పటికీ ఈ సినిమా ఓటిటిలో ఇంకా రిలీజ్ కి రాకపోవడం గమనార్హం. అయితే ఈ చిత్రాన్ని జీ5 సొంతం చేసుకున్నట్టుగా టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ గా శాటిలైట్ డీల్ కంప్లీట్ అయ్యింది కానీ ఓటిటి డీల్ కానట్టే తెలుస్తుంది. అందుకే ఇప్పటికీ ఈ సినిమా ఓటిటిలో రాలేదని తెలుస్తుంది. ఈ సినిమా కోసం కన్నడ ఆడియెన్స్ బాగానే ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు