పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు భారీ చిత్రాల్లో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉండగా ఈ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ యాక్షన్ డ్రామా “ఓజి” (They Call Him OG) కూడా ఒకటి. అయితే ఈ చిత్రంపై ఒక్క గ్లింప్స్ తో సెన్సేషనల్ హైప్ వచ్చింది.
పైగా ఈ వీడియోకి థియేటర్స్ లో దద్దరిల్లే రెస్పాన్స్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ అనూహ్యంగా ఊహించని ట్విస్ట్ ఏమిటంటే ఇలాంటి సినిమాకి ఇంకా ఓటిటి డీల్ పూర్తి కానట్టు తెలుస్తుంది. ఆల్రెడీ సెప్టెంబర్ 27 రిలీజ్ అని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఈ డేట్ లోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి అని తెలుస్తుంది.
ఇందుకు ప్రధాన కారణం ఇంకా సినిమాకి ఓటిటి డీల్ పూర్తి కాకపోవడమే అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. భారీ హైప్ ఉన్న ఈ సినిమాకి ఇంకా ఓటిటి డీల్ ఖరారు కాకపోవడం అనేది ఒకింత ఆశ్చర్యం అని చెప్పాలి. మరి చూడాలి ఈ సినిమాకి ఏమవుతుంది అనేది.