ఒక్క పాట కోసం రెండు మెగా మూవీస్ పెండింగ్..?

ఒక్క పాట కోసం రెండు మెగా మూవీస్ పెండింగ్..?

Published on Sep 28, 2024 3:01 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మెగా చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్‌ని క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటెసీ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కి ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చికన్‌గున్యతో బాధపడుతుండటంతో ఈ బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలోని ఓ ఐటెం సాంగ్‌ను సెప్టెంబర్ నెలాఖరుకు చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావించింది. చిరంజీవి కోలుకుని సెట్స్‌కి రాగానే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుపుతారని తెలుస్తోంది.

అటు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ కూడా ఇప్పటికే చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలోనూ ఓ ఐటెం సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది. ఈ పాటలో డ్యాన్స్ చేయడానికి శ్రీలీల, త్రిప్తి దిమ్రిల పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఈ పాట షూట్‌ను అక్టోబర్ చివరినాటికి పూర్తి చేయాలని సుకుమార్ అండ్ టీమ్ నిర్ణయించుకున్నారట. దీంతో ఒక్క ఐటెం సాంగ్ కోసం ఈ రెండు మెగా చిత్రాలు కూడా పెండింగ్‌లో పడటంతో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు