పవన్ రెండు సినిమాల యాదృచికం భలే కలిసిందే.!

Published on Jan 26, 2021 9:03 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను గతంలో ఎప్పుడు లేని విధంగా టేక్ చేసి అంతే స్పీడ్ గా పూర్తి చేసేస్తున్నారు. మరి అలాగే వీటిలో మొదట వరుసలో ఉంది మాత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పూర్తయ్యి విడుదలకు రెడీగా ఉంది. అయితే మరి పవన్ ఇప్పటి వరకు చేసిన ఇప్పుడు చేస్తున్న సినిమాలను చూసినట్టు అయితే ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు అలాగే గతంలో మరో రెండు సినిమాలకు యాదృచ్చికం భలే కలిసింది అని చెప్పొచ్చు.

ఇందులోకి వెళ్తే పవన్ ఇప్పటి వరకు ఏ ఏడాది కూడా రెండు సినిమాలు విడుదల చేసింది లేదు. కానీ గతంలో 2012 ఏడాదిలో “గబ్బర్ సింగ్” మరియు “కెమెరా మెన్ గంగతో రాంబాబు” రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అదే అలా విడుదల కావడం అక్కడ నుంచి మళ్ళీ పవన్ నుంచి అలాంటి రిలీజ్ పడలేదు. కానీ ఇప్పుడు అది జరిగేలానే ఉంది. మొదటగా వకీల్ సాబ్ రానుండగా తర్వాత క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ వండర్ కూడా ఇదే ఏడాదిలో విడుదల కానుంది.

మరి ఇంతే కాదు..అప్పుడు మొదటగా విడుదల కాబడిన గబ్బర్ సింగ్ రీమేక్ సినిమానే ఇప్పుడు మొదటగా వస్తున్న వకీల్ సాబ్ కూడా రీమేక్ సినిమానే..అలాగే అప్పుడు కెమెరా మెన్ గంగతో రాంబాబు స్ట్రయిట్ సినిమా కాగా క్రిష్ తో చేస్తున్న సినిమా కూడా స్ట్రయిట్ సినిమానే.. ఇంకోటి కూడా ఉంది, అప్పుడు ఏడాది 2012 కాగా ఈసారి 2021 రెండు నంబర్లు రివర్స్ అయ్యాయి. మరి ఇలా యాదృచ్చికంగా ఈ రెండూ కలిసాయి. సో ఈ ఏడాది ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :