బాలయ్య సినిమా కోసం డిఫరెంట్ టైటిల్స్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను NBK109 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

కాగా, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు నేడు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ చిత్ర టైటిల్, టీజర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు కూడా తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, ఈ సినిమా కోసం రెండు డిఫరెంట్ టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట మేకర్స్. ‘డాకూ మహారాజా’, ‘సర్కార్ సీతారామ్’ అనే రెండు వెరైటీ టైటిల్స్‌లో ఈ సినిమాకు ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారట.

ఇలా బాలయ్య సినిమా కోసం రెండు వెరైటీ టైటిల్స్‌ని పరిశీలిస్తున్న మేకర్స్, అభిమానుల అభిరుచికి అనుగుణంగా ఈ మూవీ టైటిల్ ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దర్శకుడు బాబీ ఈ సినిమాను ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేస్తున్నాడు.

Exit mobile version