నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమానే “సరిపోదా శనివారం”. మరి సాలిడ్ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం వర్షాలు తట్టుకొని మరీ భారీ బుకింగ్స్ అండ్ వసూళ్లు అందుకొని అదిరే రన్ ని థియేటర్స్ లో కొనసాగిస్తోంది. అలాగే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోని మాత్రమే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా నాని తన యు’నాని’..మాస్ ని చూపిస్తున్నాడు. ఓవర్సీస్ మార్కెట్ లో నానికి ఎంత పట్టువుంది అనేది అందరికీ తెలుసు.
ఇప్పుడు ఇదే బలంతో యూఎస్ మార్కెట్ లో లేటెస్ట్ వసూళ్లతో బ్రేకీవెన్ ని కొట్టేసాడు.. లేటెస్ట్ గా 1.6 మిలియన్ డాలర్లు మార్క్ ని ఈ సినిమా యూఎస్ లో టచ్ చేయడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సినిమా టార్గెట్ కొట్టేసింది అని ప్రకటించారు. దీనితో ఈ చిత్రంకి ఇక అంతా లాభాలే అని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో సరిపోదా శనివారం ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో ఎస్ జె సూర్య సాలిడ్ విలన్ రోల్ లో నటించగా జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.
????????’???????? ???????????? ????????????????????????????????????! ???????????????????? ???????????? ???????????? ???????????? ???????????? ???????????????? ???????????? ????????????????????????????! ????#SaripodhaaSanivaaram smashes through the $1.6 MILLION+ mark in North America????
???????????? ???????????????????????? ???????????????????????????????????????????????????????? ????????????????????????????????????????
Book your… pic.twitter.com/ZTRZhlATQa
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 1, 2024